ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!

సింగపూర్, జూలై 6:

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల పండుగ వైభవంగా జరిగింది. ఆదివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని జరిపారు. సుమారు 900 మంది ప్రత్యక్షంగా హాజరై, అంతర్జాలం ద్వారా మరో 7,000 మంది వీక్షించారు. తెలంగాణ జానపద గేయాలు, భక్తిగీతాలు, నృత్యప్రదర్శనలు ఉత్సవానికి విశేష ఆకర్షణగా నిలిచాయి.

బోయిన స్వరూప, పెద్ది కవిత, సరితా తులా, దీపారెడ్డి, మోతే సుమతి, గంగా స్రవంతి, సంగీత తదితర మహిళలు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించారు. మొదటి నుంచి చివరి వరకు సాంప్రదాయభరితంగా, సాంస్కృతిక ఘనతతో కొనసాగిన ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రశంసించారు. తెలుగు కుటుంబాలు, కార్మిక సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

మహిళలు, చిన్నారులు బోనాల గీతలకు కేరింతలతో,ఉత్సాహంతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. బోనాలు కాళికాదేవికి సమర్పించే పుణ్యనైవేద్యంగా… మట్టి కుండల్లో అన్నం, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన బోనాలను తలపై మోస్తూ, డప్పులు, పోతురాజులు, ఆటగాళ్లతో ఆలయం వరకు వెళ్లారు. వేపచెట్టు రెమ్మలు, పసుపు, కుంకుమతో అలంకరించి, దీపం వెలిగించి ఆ బోనాలను సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

పెద్దపులి ఆట, పోతురాజు వేషధారణ, సాంస్కృతిక నృత్యాలు కార్యక్రమానికి మరింత ఆకర్షణ జోడించాయి. ‘‘ఇలాంటి పండగ వేళ పిల్లలకు మన సాంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూపించడం సంతోషంగా ఉంది’’ అని హాజరైన మహిళలు తెలిపారు.